ఎస్సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు. 

కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ  జిల్లా  నాయకులు ఇమ్మడి  తిరుపతిరావు హాజరై అమరవీరులకు నివాళులర్పించారు.

ఎస్సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు. 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఫిబ్రవరి 1 :

సింగరేణి మండల  కేంద్రంలో  సినిమా  హల్ సెంటర్  ఎంఆర్పిఎస్  గద్దె  వద్ద  ఆదివారం  ఎస్సీ  వర్గీకరణ పోరులో  పశువులు  బాసిన మాదిగ   అమరవీరులకు  జోహార్  అర్పించడం జరిగింది. కార్యక్రమం  గ్రామ  శాఖ అధ్యక్షులు  ఆదెర్ల రామారావు, కుల  పెద్ద  ఆదేర్ల అంజయ్య ఆధ్వర్యంలో  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ  జిల్లా  నాయకులు ఇమ్మడి  తిరుపతిరావు హాజరై అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పోరులో పశువులు బాసిన మాదిగ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ వారి ప్రాణ త్యాగం వృధా కాకుండా ఎస్సీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కోరారు. అమరవీరుల త్యాగం వృధా కాదని వారి ప్రాణ త్యాగాలు గుర్తుంచుకొని ఎస్సీ వర్గీకరణకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నాగేంద్రబాబు, కుల పెద్ద ఆదేర్ల అంజయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు రామారావు, జిల్లా నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, ఆదేర్ల ఉపేందర్, గజ్జల శ్రీను, అంజయ్య, ప్రసాద్, సాంబ, మహిళ నాయకురాలు అరుణ, గురువమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News