జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు..ప్రజల్లో ఉన్న భయాలు అధికారులు తొలగించాలి:
పెండింగ్ భూభారతి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి:
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్ : లోకల్ గైడ్ :
జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, మండల స్థాయి అధికారులు గ్రామాల్లో ప్రజల ఆందోళనలు తొలగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని తన ఛాంబర్ నుండి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ తో కలిసి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా, పలు రెవెన్యూ అంశాలపై తహసిల్దార్లతో జూమ్ కాల్ ద్వారా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రజలకు సరిపడినన్ని గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ఈ విషయంలో ప్రజల భయాలు తొలగించాలని పేర్కొన్నారు. గృహవసరాల గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
"ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో పకడ్బందీగా అమలు పరచాలని పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలలో అధికారులు స్వయంగా పాల్గొంటూ, ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం అయ్యేలా చూడాలన్నారు.
పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులు అన్నింటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మండలాల్లో భూభారతి దరఖాస్తులు పెండింగ్లో ఉంచకూడదని పేర్కొన్నారు. ఆయా పౌర సేవల ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలస్యం చేయకూడదని వివరించారు.
మండల స్థాయి అధికారులంతా ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.
ఈ సమావేశంలో, జూమ్ కాల్ ద్వారా జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాల్గొన్నారు.
