కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు...
గ్రామపంచాయతీ సర్పంచ్ మడే శ్రీనివాస్,పలువురు
బెల్లంపల్లి (లోకల్ గైడ్)
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీ నుండి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు.వేమనపల్లి మండలంలోని దస్నాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మడే శ్రీనివాస్,పలువురు సభ్యులతో పాటు సుమారు100 మంది,అదేవిధంగా వేమనపల్లి మండలంలోని కేతనపల్లి గ్రామపంచాయతీకి చెందిన గంగపుత్ర సంఘం నాయకులు,సభ్యులు సుమారు 50మంది బెల్లంపల్లి ఎమ్మెల్యే సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి,పార్టీ బలోపేతానికి అందరు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వేమనపల్లి మండలం మాజీ జెడ్పిటిసి ఆర్ సంతోష్ కుమార్,వేమనపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ,మండల సర్పంచ్ల పోరం అధ్యక్షుడు నీల్వాయి సర్పంచ్ చెన్నూరి సమ్మయ్య,వేమనపల్లి సర్పంచ్ ఉప్పుల సాయి తదితరులు పాల్గొన్నారు.
