మాజీ సర్పంచ్ చలపతి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ పారిశుద్ధ్య పనులు
By Ram Reddy
On
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పులిగుండాల గ్రామపంచాయతీలో 99వ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామంలోని 6వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం మాజీ సర్పంచ్ సోడి చలపతి ఆధ్వర్యంలో జరిగింది.
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామాన్ని శుభ్రంగా, పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో గ్రామపంచాయతీ సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది మర్మం కృష్ణ, సరేశ్వరరావు, మడకం లక్ష్మణ్, శ్రీను, చిన్నబాబు, నాగరాజు, గంగరాజు తదితరులు పాల్గొని శుభ్రత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని అభినందించారు.
Tags:
About The Author
Latest News
14 Mar 2026 20:52:17
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
