రంజాన్ కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే...
రంజాన్ పర్వదిన పండుగ సందర్భంగా కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణంలో ఎంఎం గార్డెన్ లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్ రావు,డిసిసి మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ శనివారం ముస్లీంలకు రంజాన్ కానుకలు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందుగా ముస్లీం సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 37,55,14 డివిజన్లలో మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్ లలో పరిశుభ్రత పారిశుద్ధ్యం,ఆరోగ్యం తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.అదేవిధంగా మున్సిపల్ సిబ్బందితో మాట్లాడుతు వారికి ఎటువంటి సమస్యలు ఉన్న అందరికీ నేనున్నాను అని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పోరేషన్ మేయర్ ధర్ని మధుకర్,డిప్యూటీ మేయర్ సల్ల రమ్య,మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.
