సోషలిజం అజేయం.
అధ్యాయనం ద్వారా సమాజ మార్పు.
By Ram Reddy
On
ఘనంగా రెడ్ బుక్ డే.
నల్లగొండ ఉమ్మడి జిల్లా .ఫిబ్రవరి 21. (లోకల్ గైడ్).
రెడ్ బుక్ డే అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒక ముఖ్యమైన దినోత్సవమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు . శనివారం సుందరయ్య భవన్ రుద్రాక్ష ఎర్రయ్య స్మారక హాల్లో రెడ్ బుక్ డే సందర్భంగా బరితెగించిన అమెరికన్ సామ్రాజ్యవాదం అనే బుక్ ను సిపిఎం నల్గొండ నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తలు అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక మార్పు, మానవ హక్కులు , సమానత్వం కోసం రాసిన గొప్ప పుస్తకాలను గౌరవించుకోవడానికి ఈ రోజును కేటాయించారని అన్నారు.1848 ఫిబ్రవరి 21న కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఏంగెల్స్ రాసిన "కమ్యూనిస్ట్ మేనిఫెస్టో" మొదటిసారిగా ప్రచురించబడింది. ఈ పుస్తకం ప్రపంచ చరిత్రను, రాజకీయాలను , సామాజిక ఆలోచనా దృక్పథాన్ని విప్లవాత్మకంగా మార్చివేసింది. ఆ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజును నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అభ్యుదయ రచయితలు, మేధావుల మీద దాడులు పెరుగుతున్న తరుణంలో,అంటే ప్రజాస్వామ్య విలువల కోసం, అణచివేతకు వ్యతిరేకంగా, శ్రామిక వర్గాల హక్కుల కోసం రాసిన సాహిత్యానికి ప్రాచుర్యం కల్పించడం. స్వేచ్ఛా ఆలోచనలను , పుస్తకాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవం పుట్టిందని,
'రెడ్ బుక్' అంటే కేవలం కమ్యూనిస్ట్ పుస్తకాలు అని మాత్రమే కాదు. సామాజిక న్యాయం, సమానత్వం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే ఏ అభ్యుదయ పుస్తకాన్నైనా 'రెడ్ బుక్'గా పరిగణించాలని అన్నారు. శనివారం పఠన సంస్కృతి పెంచే దృష్టితో సమాజంలో మార్పు తీసుకురావడానికి పుస్తక పఠనం ఎంత అవసరమో ప్రజలకు వివరించాలి.అభ్యుదయ విప్లవ భావాలు అభివృద్ధి చేసే లక్ష్యంతో కుల, మత, వర్గ విభేదాలకు వ్యతిరేకంగా పోరాడిన మేధావుల రచనలను నేటి తరానికి పరిచయం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ తమ ఆయుధాలను అమ్ముకోవడానికి దేశాల మధ్యన యుద్ధాలు సృష్టిస్తుందని ఆరోపించారు యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా మానవాళిని ఏకం చేయాల్సిన కర్తవ్యం మనపై ఉందని అన్నారు అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాద విధానాలకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. సుంకాలను పెంచుతూ దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తున్న అమెరికా సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకరావలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం, జిల్లా కమిటీ యం డి సభ్యులు యం డి సలీం, దండెంపల్లి సత్తయ్య, కొండ అనురాధ, నల్లగొండ తిప్పర్తి మండల కార్యదర్శి నలపరాజు సైదులు, మన్నెం బిక్షం, పట్టణ మండల కమిటీ సభ్యులు అవుట రవీందర్ పోలే సత్యనారాయణ అద్దంకి నరసింహ గుండాల నరేష్ గంజి నాగరాజు ముత్యాలు యాదగిరి లింగమ్మ కన్నె కంటి సత్యనారాయణ సర్దార్ అలీ రుద్రాక్షి రామచంద్రు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
05 Mar 2026 20:11:34
ఖమ్మం: లోకల్ గైడ్)ఆసుపత్రిలో అర్థరాత్రి వెళ్ళినా వైద్యులు అందుబాటులో ఉంటారనే నమ్మకం కల్పించాలి
వైద్య సిబ్బంది మెరుగైన పని తీరుతో మార్పు సాధ్యం
పాలేరు నియోజకవర్గంలో రెండు...
