ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం పోయింది. నాలుగు సార్లు ఓటుతో బుద్ధి చెప్పారు. - రోహిత్ రెడ్డి తాండూర్ కు చేసింది ఏమీ లేదు. 

ఆరోపణలు మాని అభివృద్ధికి సహకరించండి. 

ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం పోయింది. నాలుగు సార్లు ఓటుతో బుద్ధి చెప్పారు. - రోహిత్ రెడ్డి తాండూర్ కు చేసింది ఏమీ లేదు. 

తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ.

లోకల్ గైడ్/తాండూర్:
తాండూర్ ప్రజలు బిఆర్ఎస్ పార్టీనీ నమ్మే పరిస్థితిలో లేరని, ఆ పార్టీ పైన పూర్తిగా నమ్మకం పోయిందని... ఇప్పటికే నాలుగు సార్లు ఓటుతో బుద్ధి చెప్పారని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం చైర్పర్సన్ అధ్యక్షతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక రోహిత్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాండూరు ప్రజలకు ఎవరేంటోనని పూర్తి అవగాహన ఏర్పడింది. దుష్ప్రచారాలు మానుకొని అభివృద్ధికి సహకరించండని సూచించారు. ప్రతిసారి దాడులు, దౌర్జన్యాలు అంటూ ఆరోపణలు చేయడము సరికాదు. సాధ్యమైతే పట్టణ అభివృద్ధికి సూచనలు ఇవ్వండి. అంతేకానీ ప్రతిసారి దాడులు, దౌర్జన్యాలు అనే పదాని విరమించుకోవాలని తెలిపారు.కాగా  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, మనోహర్ రెడ్డి మంచితనంతో మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ రాహుఫ్ , సర్దార్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, మాజి కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత. అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత.
లోకల్ గైడ్/తాండూర్:ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసినట్లు పెద్దెముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మండల పరిధిలోని...
సమాజ అభివృద్ధికి మహిళలు ఆదర్శంగా నిలవాలి 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. 
స్వంత ఇల్లు కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 
పోస్టర్ తయారీపై విద్యార్థికి ప్రథమ బహుమతి 
ఈనెల 9న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి. 
సామాజిక లైంగిక దోపిడికి గురౌతున్న మహిళల