దేశవ్యాప్త సార్వత్రిక సమ్మకు కేకేసి మద్దతు

దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాల తలపెట్టిన సార్వత్రిక సమ్మె

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మకు కేకేసి మద్దతు

 (ఖమ్మం లోకల్ గైడ్)
     కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాల తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు అఖిల భారత అసంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ (కేకేసి) ఆధ్వర్యంలో మద్దతు ప్రకటించడం జరిగింది
    ఈ సందర్భంగా కేకేసి జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్ మాట్లాడుతూ... దేశంలోనే మోడీ ప్రభుత్వం కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయడాన్ని కేకేసి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఈ లేబర్ కోడ్ ల మూలంగా కార్మికులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కనీస వేతనాలు పొందేటువంటి హక్కు లేకుండా పోతుందని వ్యక్తి చాకిరి అమలవుతుందని వారు అన్నారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకుఅఖిల భారత అసంఘటిత కార్మికులు మరియు ఉద్యోగుల కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ కౌశల్ సమీర్* గారి సలహా సూచనలతో  ఈరోజు జరిగే సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలియజేశారు 
   ఈ కార్యక్రమం లో కెకెసి జిల్లా ఉపాధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్, జిల్లా నాయకులు విజయవర్మ, ఆటో యూనియన్ నగర అధ్యక్షులు బి సతీష్, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు వెంకట్ నాయుడు, వెంకటేశ్వర్లు, కత్తుల సంగయ్య, శ్రీను, భద్రం, పుల్లారావు, విజయ్, వెంకట్, తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే  నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే 
తొర్రూర్ (లోకల్ గైడ్ )తొర్రూర్ పట్టణంలోని బీఆర్ గార్డెన్ లో నిర్వహించిన తొర్రూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దొంగరి రేవతి శంకర్  కుమార్తె వివాహ మహోత్సవ వేడుకలో...
రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సిపిఆర్ పై 108 సిబ్బంది అవగాహన
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
ఘనంగా సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు*
మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
పేట కోర్టు ముందు 3వ రోజుకు చేరిన దీక్షలు