ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఫుట్‌పాత్ లు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలి.
బల్లేపల్లి పరిసర ప్రాంతంలో నిర్మిస్తున్న ఫుట్ పాత్ పనులను, టైల్స్ డిజైన్ అకృతులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.
ఖమ్మం:లోకల్ గైడ్ :
నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీలు చేశారు. నగరంలోని 2వ డివిజన్ బల్లేపల్లి పరిసర ప్రాంతంలో నిర్మిస్తున్న ఫుట్ పాత్ పనులను, టైల్స్ డిజైన్ అకృతులను కలెక్టర్ పరిశీలించారు. ఫుట్‌పాత్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఫుట్‌పాత్‌లు ప్రజలకు సౌకర్యవంతంగా, భద్రతతో ఉండేలా నిర్మించాలని, చిన్న పిల్లలు, వికలాంగులు, వృద్ధులు సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిచే విధంగా పనులు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* నగరంలో ముఖ్యమైన ప్రాంతాలలో ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఫుట్‌పాత్‌ల నడక ద్వారా ప్రజల రోడ్డు భద్రతకు, ఆరోగ్యానికి అత్యంత కీలకమని అన్నారు.
విద్యార్థులు, ప్రజలు నడుచుకుంటూ వెళ్లే పరిస్థితులు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫుట్‌పాత్‌లు అత్యంత నాణ్యతతో, సౌకర్యవంతంగా నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడా నాణ్యతలో రాజీ పడకుండా పనులు జరగాలని అధికారులను ఆదేశించారు.
నగరంలో తొలిసారిగా వినూత్నంగా టైల్స్ తో ఫుట్‌పాత్‌లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మంచి అకృతితో ఉపయోగించడం వలన ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వర్షం, ఎండ వంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా, దీర్ఘకాలికంగా నిలిచి ఉండేవిధంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
దివ్యాంగులు, వృద్ధులు సులభంగా నడిచేలా స్లోప్‌లు, ఎడ్జ్‌లు సరిగ్గా రూపకల్పన చేయాలని, ప్రజలకు వెలుతురు వలన ఏలాంటి ఇబ్బందులు కలగకుండా, రాత్రి వేళ అసౌకర్యం లేకుండా లైటింగ్ పోల్స్ ఏర్పాటు చేయాలన్నారు. నగరం అంతా ఒకే విధమైన డిజైన్‌తో గ్రానైట్ ఫుట్‌పాత్‌లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్డర్ సూచించారు.
నగరంలో ఫుట్‌పాత్‌ల అభివృద్ధి వల్ల ప్రజలు నడక వైపు మొగ్గు చూపుతారని, దీని ద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని కలెక్టర్ తెలిపారు.
జరుగుతున్న నిర్మాణ అభివృద్ధి పనుల అమలులో ఎక్కడా నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా పూర్తి బాధ్యతతో పర్యవేక్షణ చేస్తూ పనులు పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మల్లీదు వెంకటేశ్వర్లు, పబ్లిక్ హెల్త్ ఎస్ఇ రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, మునిసిపల్ కార్పొరేషన్ సహయ కమీషనర్ అనిల్ కుమార్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
