మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి- ఫ్లోర్ లీడర్,కార్పొరేటర్లకు పిలుపు..

మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇళ్లలో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవ

హనుమకొండ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి25 లోకల్ గైడ్ 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్  ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు ఛాంబర్‌లో కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులుగా కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉండటం తమ ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు.
ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫ్లోర్ లీడర్ ఛాంబర్ లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యలను స్వయంగా విని వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకూడదని, స్పందనలో జాప్యం అస్సలు ఉండకూడదని అన్నారు.
గతంలో కాంగ్రెస్‌కు చెందిన నలుగురు కార్పొరేటర్లు ఉన్నప్పటికీ అభివృద్ధి పనులకు సరైన నిధులు కేటాయించలేదని విమర్శించారు. ప్రస్తుతం అన్ని డివిజన్లకు, పార్టీ భేదం లేకుండా 
బి ఆర్ ఎస్, బి జె పి  డివిజన్ల కు  సమానంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో రాజకీయాలకు స్థానం లేదని, ప్రజలే ప్రాధాన్యం అని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల అమలుపై కూడా స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా పట్టణ పరిధిలో ఉండటంతో చాలా మందికి ఇంటి స్థలాలు లేక ఎంపిక ప్రక్రియలో జాప్యం జరుగుతోందని వివరించారు. ఇంటి స్థలం ఉన్న అర్హులు తమ పత్రాలను వెంటనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేయాలని కోరారు.ఇందిరమ్మ ఇళ్ల పేరుతో  ఎవ్వరికి డబ్బులు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా డబ్బులు అడిగితే వారు ఎంతటి వారైనా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారికి ప్రోత్సాహక బహుమానం ఇవ్వడమే కాకుండా, డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం కార్పొరేటర్ల తో కమిషనర్  చాహత్ బాజ్ పాయ్ ని కలిసి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో  టి పి సి సి ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ రజాలి, మామిండ్ల రాజు యాదవ్, దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, చీకటి ఆనంద్, మానస రాంప్రసాద్, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే  నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే 
తొర్రూర్ (లోకల్ గైడ్ )తొర్రూర్ పట్టణంలోని బీఆర్ గార్డెన్ లో నిర్వహించిన తొర్రూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దొంగరి రేవతి శంకర్  కుమార్తె వివాహ మహోత్సవ వేడుకలో...
రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సిపిఆర్ పై 108 సిబ్బంది అవగాహన
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
ఘనంగా సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు*
మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
పేట కోర్టు ముందు 3వ రోజుకు చేరిన దీక్షలు