మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
వెలికట్టే గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించారు.
పాలకుర్తి (లోకల్ గైడ్ )
పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి, తొర్రూరు పట్టణంలో తమ అధికారిక కార్యక్రమాలు ముగించుకుని పాలకుర్తి వైపు ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలోని వెలికట్టే గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించారు.
ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అనుకోకుండా కిందపడడంతో గాయాలపాలయ్యారు. పరిస్థితిని గుర్తించిన వెంటనే ఎమ్మెల్యే తమ వాహనాన్ని ఆపించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
అత్యవసరంగా వైద్య సహాయం అందించాల్సిన అవసరం ఉందని భావించిన వారు తక్షణమే పోలీసులకు సమాచారం ఇచ్చి, వారి సహకారంతో గాయపడిన దంపతులను సమీప ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అవసరమైన వైద్యసహాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ఈ ఘటనను చూసిన స్థానికులు ఎమ్మెల్యే స్పందనకు ప్రశంసలు కురిపించారు. ప్రజా ప్రతినిధిగా మాత్రమే కాకుండా ఒక మానవతా దృక్పథం కలిగిన వ్యక్తిగా వ్యవహరించి ప్రాణాలకు ప్రాధాన్యత ఇచ్చారని అభినందించారు.
ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలవడం తమ బాధ్యత అని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. ఈ సంఘటన ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
