ఘనంగా సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు*

కార్యక్రమoలో కుల పెద్దలు ఉద్యోగ ఉపాధ్యాయు , విద్యార్థి యువకులు పాల్గొన్నారు .

ఘనంగా సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు*

ఖమ్మం :లోకల్ గైడ్ :
ఖమ్మం బంజారా భవన్ నందు  సద్గురు సంత్ శ్రీసేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకొని ఖమ్మం నగరం నందు బంజారా భవన్ నందు జరిగింది"భోగ్ బండారు" కార్యక్రమoలో కుల పెద్దలు ఉద్యోగ ఉపాధ్యాయు , విద్యార్థి యువకులు పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన రాష్ట్ర కోఆర్డినేటర్ భూక్య బిక్షపతి రాథోడ్ అధ్యక్షత వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి పాల్గొని మాట్లాడారు . శ్రీ సేవాలాల్ మహారాజ్ ఈ గిరిజన జాతి చైతన్య పరుస్తూ చేసినటువంటి ప్రబోధలు వల్ల సమాజంలో ఒక గుర్తింపును తీసుకురావడం ఆనాడే  పశుసంపద అభివృద్ధి చెందాలని సమాజంలో మూఢవిశ్వాసాలు మానుకొని స్త్రీలను గౌరవిస్తూ స్థిర వ్యవసాయం చేస్తూ సమాజంలో ఈజాతికి ఒక గౌరవం తీసుకొచ్చిన మహనీయుడు సేవలాల్ మహారాజ్ అని కొనియాడారు . ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన నాయకులు కిషన్ నాయక్ , ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్ యాదవ్ , తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీరు నాయక్ , మాలోత్ రాము నాయక్ , టి ఎస్ టి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంగ్యా నాయక్ , బుక్య శోభన్ నాయక్ , గిరిజన నాయకులు రాంబాబు నాయక్ , డి వెంకట్రాం నాయక్ , బిచ్చు నాయక్ , తారాబాయి , ప్రమీల బాయ్ , ఏ సీఎం రాములు నాయక్ , బద్రు నాయక్ , రాజ్ కుమార్ నాయక్ , నెహ్రూ నాయక్ తదితరులు పాల్గొన్నరు .

Tags:

About The Author

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే  నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే 
తొర్రూర్ (లోకల్ గైడ్ )తొర్రూర్ పట్టణంలోని బీఆర్ గార్డెన్ లో నిర్వహించిన తొర్రూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దొంగరి రేవతి శంకర్  కుమార్తె వివాహ మహోత్సవ వేడుకలో...
రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సిపిఆర్ పై 108 సిబ్బంది అవగాహన
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
ఘనంగా సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు*
మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
పేట కోర్టు ముందు 3వ రోజుకు చేరిన దీక్షలు