బ్యాలెట్ బాక్స్ లను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ సెంటర్ కు తరలింపు .
ఎన్నికల అధికారి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి శరత్ చంద్ర వెల్లడించారు.
By Ram Reddy
On
నల్గొండ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించిన 2వ సాధారణ ఎన్నికల సందర్భంలో, పోలింగ్ ముగిసిన అనంతరం బుధవారం అర్ధరాత్రి మొత్తం 199 పోలింగ్ కేంద్రాల (పీఎస్ నెం. 1 నుండి 199 వరకు) బ్యాలెట్ బాక్సులు , పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌ను డీఆర్‌సీ సెంటర్‌లోని తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ సెంటర్ (తెలంగాణ స్టేట్ వేర్‌హౌస్ గోదాములు, అర్జాలబావి) లోని ప్రధాన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించినట్టు జిల్లా అదనపు ఎన్నికల అధికారి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి శరత్ చంద్ర వెల్లడించారు.ఈ బ్యాలెట్ బాక్సులు పోటీ అభ్యర్థుల
సమక్షంలో పోలీసు భద్రత మధ్య సీల్డ్ చేసిన డీజీటీ వాహనంలో భద్రంగా తరలించబడినవి. సంబంధిత అన్ని పత్రాలు సక్రమంగా సీలింగ్ చేయబడినవి. లాగ్ బుక్‌లో పోటీ అభ్యర్థుల సంతకాలు తీసుకోబడినవి.
Tags:
About The Author
Related Posts
Latest News
24 Feb 2026 20:47:27
జనగామ టౌన్ ( లోకల్ గైడ్ ):-
జనగామ భక్తబృందం ఆధ్వర్యంలో సుమారు 250 మంది భక్తులతో జనగామ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి 11 హనుమాన్ దేవాలయాలలో...
