వేగం కన్నా ప్రాణం ముఖ్యం : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి, ఐపీఎస్.
అర్ముడ్ అధికారుల, సిబ్బంది నూతన పోలీసు నివాస భవనాలను ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి
By Ram Reddy
On
రామగుండం, ఏప్రిల్.15..(లోకల్ గైడ్)
రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు విచ్చేసిన రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డిని పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు సాదరంగా పూల మొక్క అందజేసి ఆహ్వానించారు. కమిషనరేట్ సాయుధ పోలీసు సిబ్బంది గౌరవవందనం సమర్పించి డీజీపీకి స్వాగతం పలికారు.
అనంతరం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ల పోలీస్ అధికారులతో కలిసి రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ,రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “అరైవ్… అలైవ్” కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఒక సామాజిక సమస్యగా మారాయని,వాటిపై విస్తృత అవగాహన కల్పించడం అత్యవసరమని తెలిపారు. ఇందుకోసం ప్రతి నెల చివరి వారంలో నిర్వహించే “అరైవ్… అలైవ్” కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు.
రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలను గణనీయంగా తగ్గించడం అత్యంత అవసరమని పేర్కొంటూ, ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని తెలిపారు.
“వేగం కన్నా ప్రాణం ముఖ్యం” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా చేయాలని,“Arrive Alive” కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. గ్రామాలు,పట్టణాల్లో అవగాహన సదస్సులు,ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని ఆదేశించారు.
డిఫెన్సివ్ డ్రైవింగ్‌పై ప్రత్యేక శిక్షణలు నిర్వహించడం, సీట్‌బెల్ట్ మరియు హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరిగా అమలు చేయించడం వంటి చర్యలు చేపట్టాలని తెలిపారు.ట్రాఫిక్ నియమాల పట్ల నిర్లక్ష్యం ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
అదేవిధంగా,రోడ్డు ప్రమాదాల్లో బాధితుల కుటుంబ సభ్యుల అనుభవాలు, అభిప్రాయాలను ప్రజలతో పంచుకోవడం ద్వారా అవగాహన మరింత పెరుగుతుందని సూచించారు. ప్రస్తుతం నేరాలు కొత్త రూపాలు దాల్చుతున్నాయని, నేరస్తులు టెక్నాలజీ వినియోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు.అందువల్ల ప్రతి అధికారి సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు ప్రజల్లో కూడా అవగాహన పెంపొందించడం అవసరమని పేర్కొన్నారు.
అనంతరం గోదావరిఖని ఐబీ కాలనీలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ. 12.29 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన పోలీస్ క్వార్టర్స్‌ను ప్రారంభించారు.ఈ క్వార్టర్స్ నిర్మాణ పనులు 22-02-2024న ప్రారంభమయ్యాయి. మొత్తం ఒక ఏసీపీ హౌస్,రెండు ఆర్ఐ క్వార్టర్స్,నాలుగు ఆర్ఎస్‌ఐ క్వార్టర్స్, 12 ఏఆర్‌ఎస్‌ఐ క్వార్టర్స్‌తో పాటు హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్ల కోసం నివాస గృహాలను నిర్మించారు.
పోలీసు సిబ్బందికి మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఆధునిక భవనాలు పోలీసు సిబ్బందికి మెరుగైన నివాస వాతావరణాన్ని కల్పించడంతో పాటు, పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నాయని డీజీపీ అన్నారు. రామగుండం కమిషనరేట్ పోలీస్ ప్రజాసేవలో మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మల్టీజోన్-I ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, టీజీపీఐసీఎస్ చైర్మన్ గుర్నాథ్ రెడ్డి,పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీత్, ఎసీపీలు, సీఐలు,ఇన్స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
17 Apr 2026 20:26:09
నారాయణపేట ఏప్రిల్ 17:
కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
