పాలమూరు కార్పొరేషన్ లో క్యాంపు రాజకీయాలు మొదలు..! - కాంగ్రెస్ కార్పొరేటర్ లను ఆంధ్రప్రదేశ్లోని చీరాలకు తరలించిన నాయకులు 

అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో మొదలైన మేయర్ అభ్యర్థి ఎన్నిక ప్రక్రియ 

పాలమూరు కార్పొరేషన్ లో క్యాంపు రాజకీయాలు మొదలు..! - కాంగ్రెస్ కార్పొరేటర్ లను ఆంధ్రప్రదేశ్లోని చీరాలకు తరలించిన నాయకులు 

ఎవరికివారు అంచనాల్లో నిమగ్నమైన మేయర్ ఆశావహులు  - తమ ప్లాన్లలో తాము నిమగ్నమైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు 



మహబూబ్ నగర్ ఫిబ్రవరి 14 (లోకల్ గైడ్ ప్రతినిధి వెంకటేష్ గౌడ్) 

కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల ప్రక్రియ ముగిసింది. ఇక పాలమూరు కార్పొరేషన్ లో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మహబూబ్నగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 29 మంది అభ్యర్థులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చీరాలకు నేటి ఉదయం తరలించారు. 16వ తేదీన జరిగే మేయర్ ఎన్నిక వరకు వారు అక్కడే ఉండనున్నారు. 16వ తేదీన అధికారికంగా మేయర్ ను ఎన్నుకొని ఉన్నారు. మేయర్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ నుండి ప్రసన్న ఆనంద్ కుమార్ గౌడ్ సిరాజ్ ఖాద్రి,అమర్ కుటుంబం తదితరులు పోటీలో ఉన్నారు. ఈ సందర్భంలో మేయర్ ఎన్నిక కత్తి మీద సాములా మారింది. ఇక డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా అదే విధంగా తయారయింది. పాలమూరులో క్యాంపు రాజకీయాలకు తెరలేవడంతో కార్పొరేషన్ లోని ప్రజలు ఉత్కంఠ గా ఏం జరుగుతుందోనని ఎదురుచూస్తున్నారు. ఇక వివిధ పార్టీల బలబలాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ 29 చోట్ల,బిఆర్ఎస్ 16 చోట్ల, భారతీయ జనతా పార్టీ ఎనిమిది చోట్ల, ఇండిపెండెంట్ లో నలుగురు, ఎంఐఎం ముగ్గురు గెలుపొందారు. ఇక మేయర్ అభ్యర్థి ఎన్నిక ఎలా ఉండబోతుందోనన్న ప్రజల్లో నెలకొని ఉంది. ఈ ఉత్కంఠకు తెర పడాలంటే పడాలంటే 16వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

Tags:

About The Author

Latest News