సప్తగిరి స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

కలెక్టర్‌, డీఈవో, ఎంఈవోలు పాఠశాలకు రావడం పలువురిని ఆకట్టుకుంది.

సప్తగిరి స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. ఫిబ్రవరి 14. (లోకల్ గైడ్).

.నల్లగొండ పట్టణంలోని  కేంద్రంలోని సప్తగిరి స్కూల్ ఇంగ్లీష్ మీడియం శనివారం విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పడంతో పాటు, కలెక్టర్‌, డీఈవో, ఎంఈవోలు పాఠశాలకు రావడం పలువురిని ఆకట్టుకుంది. విద్యార్థులే ఉపాధ్యాయులుగా చక్కటి పాఠశాలను బోధించారు.విద్యాశాఖ మంత్రి నేహా శ్రీ ,ఎమ్మెల్యేలు కే మోహన్, సాయి తరుణ్, సాయికిరణ్, భీమ్, జిల్లా కలెక్టర్‌ పూజ, జిల్లా ఎస్పీ వంశీ, డీఈవో రామ్ చరణ్, ఎంఈవో ప్రసన్న పాఠశాలను సందర్శించి పరిశీలించడం, తనిఖీలు చేయడం ఆకట్టుకుంది. అలాగే పాఠశాల హెచ్‌ఎం తో పాటు ఉపాధ్యాయులుగా ఇతర విద్యార్థులు వ్యవహరించారు. హెచ్‌ఎం విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మరియు  కరస్పాండెంట్ సైదులు, ఉపాధ్యాయులు మూర్తి,  నరసింహ, శంకర్, గౌస్, శ్రీకాంత్, ఫాహిమా, సరిత, ధనలక్ష్మి, కళ్యాణి, నాగమణి  విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News