నాటు సార విక్రేత అరెస్టు.
నిందితుడి నుంచి 5.లీటర్ల నాటు సారా స్వాధీనం.
తాండూర్ ఎక్సైజ్ ఇంచార్జ్ సిఐ ఎన్. రాణి
లోకల్ గైడ్/ తాండూర్:
ప్రభుత్వ నిషేధిత నాటు సారా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని తాండూర్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గురువారం సాయంత్రం వెలుగు చూసింది. ఎక్సైజ్ ఇంచార్జ్ సిఐ రాణి తెలిపిన వివరాల ప్రకారం... జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి
విజయభాస్కర్ ఆదేశాల మేరకు,అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నమ్మదగ సమాచారం మేరకు నెల్లిగడ్డతాండా నుంచి రుక్మాపూర్ వెళ్లే దారిలో రూట్ వాచ్ నిర్వహిస్తుండగా,అటు వైపు ఒక వ్యక్తి బైక్ పై వెళుతుండడం గమనించాము. ఈ క్రమంలో మా సిబ్బంది అతని విచారించగా నెల్లిగడ్డ తాండకు చెందిన మూడవత్ రాజేష్(25) నాటు సారా ప్యాకెట్లు (05) విక్రయిస్తున్నాడు. ఒక్కొక్కటి ఒక లీటరు కలిపి సుమారు 5 లీటర్లు నాటు సారాయి ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో నిందితుడు నుంచి ఐదు లీటర్ల నాటు సారాయిని సిజ్ చేసి,అదుపులోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ప్రభుత్వ నిషేధిత నాటుసారా, గంజాయి, డ్రగ్స్, గుట్కా, వంటి మత్తు పదార్థాలను ఎవరైనా విక్రయిస్తే శాఖ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా మీ చుట్టుపక్కల ఎవరైనా నాటు సారాయి విక్రయించినట్లు తెలిసిన వెంటనే 8712658754 నంబర్ సమాచారం ఇవ్వండని అన్నారు. అట్టి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు నిజాముద్దీన్ ,రవికుమార్, సిబ్బంది భీమయ్య, రాజేందర్, ఆసిఫా బేగం, రమేష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
