మహిళా సంఘాల బలోపేతానికి భవన నిర్మాణం
పెద్దగుండ్ల తండలో మహిళా సంఘం భవనానికి భూమి పూజ మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది :
By Ram Reddy
On
మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి
మిడ్జిల్ మార్చి 6(లోకల్ గైడ్ ):
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. మహిళలు సంఘాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకొని కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకుంటున్నారని తెలిపారు. మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక భవనం అవసరం ఉండటంతో ఈ భవన నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
గ్రామాల్లో మహిళలు ఐక్యంగా పనిచేస్తే గ్రామాభివృద్ధి వేగంగా జరుగుతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళల భాగస్వామ్యం పెరిగితే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజు నాయక్, ఉప సర్పంచ్ శ్రీను నాయక్, గ్రామపంచాయతీ కార్యదర్శి శైలజ, మాజీ ఉప సర్పంచ్ తిరుపతి నాయక్, మాజీ వార్డు సభ్యుడు శంకర్, దీప్లా, బాబు, దేవ్య, ఆంగోత్ దేవుల నాయక్ , శ్రీను, కుమార్, శంకర్, తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, మహిళా సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Tags:
About The Author
Latest News
19 Mar 2026 19:54:11
లోకల్ గైడ్/బంట్వారం:
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బంట్వారం మండల పరిధిలోని తుర్మామిడి గ్రామంలో బుధవారం ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....
