గ్రామాభివృద్ధికి గ్రామసభలే బలమైన వేదిక: స్పెషల్ ఆఫీసర్ అంబిక

గ్రామపంచాయతీలో ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభను ఘనంగా నిర్వహించారు.

గ్రామాభివృద్ధికి గ్రామసభలే బలమైన వేదిక: స్పెషల్ ఆఫీసర్ అంబిక

 

మిడ్జిల్ ఏప్రిల్ 2(లోకల్ గైడ్ ):

ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు నిర్వహణ
మిడ్జిల్  మండల పరిధిలోని పెద్దగుండ్ల తండా గ్రామపంచాయతీలో ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ అంబిక ముఖ్య అతిథిగా హాజరై గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై విస్తృతంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామసభలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని, ప్రతి ఒక్కరూ పాల్గొని తమ సమస్యలు, అభిప్రాయాలు, అవసరాలు నేరుగా వెల్లడించే వేదికలుగా గ్రామసభలు నిలుస్తాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరాలంటే గ్రామసభలలో చర్చలు, పారదర్శకత అవసరమని స్పష్టం చేశారు.
గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు పై గ్రామస్తులతో చర్చించి వారి సూచనలు స్వీకరించారు. ముఖ్యంగా పింఛన్లు, రేషన్, పథకాల ఎంపిక, స్వచ్ఛత, తాగునీటి సమస్యలు, రహదారుల పరిస్థితిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ శైలజ మాట్లాడుతూ గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాలను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. అంగన్వాడి టీచర్ మాధవి, ఆశ వర్కర్ సుగుణ గ్రామంలోని ఆరోగ్య, పోషణ సేవలపై వివరాలు అందించారు.
సర్పంచ్ రాజు నాయక్ మరి మరియు ఉప సర్పంచ్ శ్రీను నాయక్  గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. వార్డ్ మెంబర్లు భాస్కర్ నాయక్, ఉన్ని, రంగమ్మలు తమ తమ వార్డుల సమస్యలను గ్రామసభలో ప్రస్తావించారు.
గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను తెలియజేసి అధికారుల నుండి హామీలు పొందారు. గ్రామసభల ద్వారా గ్రామాభివృద్ధి వేగవంతమవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. 
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, నాయకులు మధు నాయక్ లక్ష్మణ్ నాయక్ వెంకటేష్ నాయక్ శంకర్ నాయక్ కృష్ణా నాయక్ గణేష్ నాయక్ రేఖ నాయక్ గణేష్ నాయక్ గోరియానాయక్ రాజు నాయక్ గ్రామస్థులు, యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!