చుచుంద్ పాఠశాలలో కంప్యూటర్ ప్రింటర్ లను ప్రారంభించిన

జూనియర్ సివిల్ జడ్జి దేవేంద్ర బాబు. 

చుచుంద్ పాఠశాలలో కంప్యూటర్ ప్రింటర్ లను ప్రారంభించిన

 

నిర్మల్ : లోకల్ గైడ్ :
దివ్యాంగ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ సాయి శ్రద్ధ ఫార్మసీ ముంబై వారి ఆర్థిక సహకారంతో భైంసా మండలం లోని చుచుంద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం కంప్యూటర్ ప్రింటర్ ను బైంసా జూనియర్ సివిల్ జడ్జి(న్యాయమూర్తి) దేవేంద్ర బాబు ప్రారంభించారు. 
 అనంతరం  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దివ్యాంగుడైన పంచగుడి మహేష్ చేస్తున్న సేవలను కొనియాడుతూ విద్యార్థులు కూడా చక్కగా చదువుకొని, సమాజం పట్ల సేవా గుణాన్ని కలిగి ఉండాలని, ఆ విధంగా ఉపాధ్యాయులు అందరూ విద్యార్థులను, క్రమశిక్షణగా సమాజం పట్ల సేవా తత్పరత కలిగి ఉండే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. పాఠశాల తరగతి గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో దాత పంచగుడి మహేశ్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంతెన వెంకటేశ్వర్, గ్రామ సర్పంచ్ రాచేవాడ్ గణేష్, మండల విద్యాధికారి ఏ.సుభాష్  ఉపాధ్యాయులు ముత్తన్న, గంగాధర్, పెద్దకాపు గజారాం, గౌతమ్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్, రాజేశ్వర్, పండరి, జి రాజేశ్వర్, వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!