జర్మనీలో ఉద్యోగావకాశాలు యువతకు స్వర్ణావకాశం
జిల్లా ఉపాధి అధికారి, నిర్మల శనివారం నాడు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖ పరిధి లో పనిచేస్తున్న తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టి ఓ ఎం సి ఓ ఎం) రిజిస్టర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా రాష్ట్రానికి చెందిన అర్హత కలిగిన, నైపుణ్యంతో కూడిన మరియు అర్ధ నైపుణ్య కార్మికులకు విదేశీ ఉద్యోగావకాశాలు కల్పించడానికి నియామక డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లు
జిల్లా ఉపాధి అధికారి, నిర్మల శనివారం నాడు తెలిపారు.
టామ్ కామ్ గల్ఫ్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, హంగేరీ, జపాన్, పోలాండ్, గ్రీస్, రొమేనియా, యుఏఈ, సౌదీ అరేబియా, యుకే తదితర దేశాల్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ నమోదిత సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పరచుకుందనీ తెలిపారు.
ప్రస్తుతం జర్మనీలో ఎలక్ట్రిషియన్ ఉద్యోగాలకు అవకాశాలు లున్నాయనీ, ఎలక్ట్రిషియన్ ట్రేడ్‌లో ITI అర్హతతో పాటు కనీసం 2 సంవత్సరాల అనుభవం కలిగిన, 19 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.ఆసక్తి అర్హత గల అభ్యర్థులు తమ నవీకరించిన బయోడేటాను tomcom.resume@gmail.com లేదా tomcomassociate@gmail.com
ఇమెయిల్ చిరునామాలకు,www.tomcom.telangana.gov.in వెబ్ సైట్ లో పంపవచ్చనీ తెలిపారు. మరిన్ని వివరాలకు9440049520 / 9440052081 లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
టి ఓ ఎం సి ఓ ఎం ఆధ్వర్యంలో ఈనెల 7న గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్, పటాంచేరు ,బీరంగూడ కమాన్ సమీపంలో గల
అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.జిల్లాకు చెందిన అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
