ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 9 :
సింగరేణి మండలం రేగులగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ వీసం మోతి వీరస్వామి , కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, మాజీ దేవస్థాన చైర్మన్ అడ్డగోడ ఐలయ్య పంచాయతీ పాలకవర్గం సభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టమ్మకంగా తలపెట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా రొట్టమాకురేవు గ్రామంలో నీ రైతు వేదిక ప్రాంగణలో ఎన్నో రోజులుగా పేరుకుపోయిన చెత్త, కలుపు మొక్కలను, ముళ్లపొదలను సర్పంచ్ మోతి వీరస్వామి , అడ్డగోడ ఐలయ్య పలుగు పారా చేతినా పట్టి శుభ్రం చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టిన ప్రణాళిక కు కార్యాచరణ అమలుకై జిల్లా కలెక్టర్ అనుదిప్ దూరిశెట్టి, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కు అనుగుణంగా కార్య ప్రణాళిక లో ఎటువంటి జాప్యం దొరల్లకుండా గ్రామ పంచాయతీ లోనీ రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ లో పేరుకుపోయిన చెత్త చేదారాలు, మురికినీరు పల్లె రహదారుల వెంబడి మూళ్ళ పొదలను అన్నీ పనులను విధిగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో భాగంగా ప్రతి ఒక్క పౌరుడు విధిగా తనవంతు గ్రామ పంచాయతీ అభివృద్ధి కై తమతో పలుపంచుకోవాలని కోరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఐలయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో రైతు వేదిక ఎటువంటి కార్యక్రమాలకు గాను నోచుకోవడం జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమని రైతు వేదికలో అనే ప్రభుత్వ సంబంధిత కార్యక్రమలు జరుపుకోవడం రైతులకు ఇదే వేదికలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చొరవతో రైతుల పంట పొలాలు ముఖ్యం గా మొక్క జొన్న పంటలకు సంమృద్ధిగా యూరియా ను ప్రభుత్వం అందజేయడం జరిగింది అనీ పలికినాడు.ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ ఆవుల సత్యనారాయణ, వార్డ్ మెంబర్ ఇర్ప నరసింహారావు, ఎన్. సైదులు, పంచాయతీ కార్యదర్శి వీసం రవికుమార్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.