ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ..

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లు ఆదివారం అందజేసారు

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ..

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

మంచిర్యాల నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లు ఆదివారం అందజేసారు.దండేపల్లి మండలానికి చెందిన11మంది లబ్ధిదారులకు 2లక్షల57వేలు,అదేవిధంగా లక్షెట్టీపేట మండలానికి చెందిన 4గురు లబ్ధిదారులకు1లక్ష 26వేల చెక్కులను లబ్ధిదారులకు అందజేసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.పేద ప్రజలకు ఆరోగ్య అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని అన్నారు.రాష్ట్రంలో పేద ప్రజలు అనారోగ్యంతో బాధలు పడకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరితగతిన సహాయ నిధి పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట్ మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి,వైస్ చైర్మన్ మోత్కూరు రాజేశ్వరి,మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేం చంద్,వైస్ చైర్మన్ ఆరీఫ్,పలువురు కౌన్సిలర్లు,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News