మహిళ పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివి...

మహిళ పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివి...

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)


మహిళ పారిశుద్ధ్య కార్మికుల సేవలు నేటి ఆధునిక సమాజంలో ఎనలేనివని బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం సందర్బంగా మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్,పలువురు మహిళ కౌన్సిలర్ లు,మెప్మా సిబ్బంది బెల్లంపల్లి మున్సిపల్ పారిశుధ్య మహిళ కార్మికులను శాలువా పూల మాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతు వేకువజామున పట్టణాన్ని అన్నివిధాల పరిశుభ్రపరుస్తు ఆహ్లాదభరిత,ఆరోగ్యవంతమైన వాతావరణం అందిస్తున్న వారి సేవలు అనిర్వచనం అని అన్నారు.పట్టణాన్ని తమ స్వంత ఇంటి వలే పరిశుభ్రంగా ఉంచుతు వారు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ జె సంపత్,వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ,పలువురు మహిళ కౌన్సిలర్లు,మెప్మా సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News