సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పివి వ్యాక్సిన్ దోహదం  

జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య.

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పివి వ్యాక్సిన్ దోహదం  

 

 

 లోకల్ గైడ్/ సంగారెడ్డి :

సంగారెడ్డి, జిల్లా కేంద్రం గా  ప్రపంచవ్యాప్తంIMG-20260308-WA0224గా మహిళల్లో పెద్ద ఆరోగ్య సమస్యగా ఉన్న సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పివి వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు.  ఆదివారం సంగారెడ్డి జనరల్ ఆసుపత్రి లో హెచ్‌పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 15 సంవత్సరాల లోపు బాలికలకు జనరల్ ఆసుపత్రి , ఏరియా ఆసుపత్రుల్లో హెచ్‌పివి వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు.
జిల్లాలో 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల సుమారు 12,500 మంది బాలికలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించినట్లు తెలిపారు.ఈ బాలికలందరికీ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక,  99 రోజుల  కార్యక్రమం కాలంలో ఉచితంగా వ్యాక్సినేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.బాలికల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రుల సమక్షంలోనే ఈ వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.  క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణం కోసం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు సహకరించాలని పిలుపు నిచ్చారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని  కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా '' వసంతరావు ,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News