పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలి .

సిపిఎం ప్రజాసంఘాల నాయకుల డిమాండ్. 

పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలి .

చమురు కొరత సాకుతో ప్రజలపై రూ.60 వేల కోట్ల భారం.

లోకల్ గైడ్/తాండూర్:
పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని గ్యాస్ సిలిండర్ తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ...ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న యుద్ధం పేరుతో చమురు నిల్వల కొరత తీవ్రంగా ఉందనే సాకుతో గ్యాస్ ధరలు పెంచడం వల్ల సామాన్యులపై పెనుబారం పడుతుందని అన్నారు. విశ్వ గురువును అని చెప్పుకునే నరేంద్ర మోడీ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారని ప్రశ్నించారు.అమెరికా చెప్పు చేతల్లో మన దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. తక్షణమే పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కే చంద్రయ్య, జి. రత్నం, సిపిఎం నాయకులు శ్రీనివాస్, దస్తప్ప, ఎమ్మార్పీఎస్ పట్టణ కార్యదర్శి రవికుమార్, రాములు, రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News