కారేపల్లి లో వరి,మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
మండల తహసిల్దార్ కు వినతి పత్రం
By Ram Reddy
On
సీ పీ ఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 26 :
గురువారం స్థానిక కారేపల్లి లో ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కే నరేంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులకు కొండబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం పత్తి, మిర్చి దెబ్బతిని ప్రత్యామ్నాయ పంటగా వరి మొక్కజొన్న పంటలను రైతులు ఎంచుకొని విరివిగా వేశారని పండిన పంటకు అమ్మకానికి ఇబ్బంది కలగకుండా సరసమైన ధరలకు అమ్ముకోవడానికి మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, పంటకు గిట్టుబాటు ధర అందించాలని,వరితో పాటు మొక్కజొన్నకు కూడా బోనస్ను వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ మధ్యకాలంలో వరి, మొక్కజొన్న పంట వెయ్యరాదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్న మాటలు రైతులను ఆందోళన గురి చేస్తున్నాయని విమర్శించారు. పంటలు రైతు చేతికి వస్తున్న ప్రస్తుత తరుణంలో కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని లేనియెడల రైతులను కూడగట్టి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శి ముండ్ల ఏకాంబరం , వజ్జా రామారావు , పార్టీ సీనియర్ నాయకులు తలారి దేవ ప్రకాష్ , పోడు భూముల సంఘం నాయకులు పాసిని నాగేశ్వరరావు , ఈసం వెంకటేశ్వర్లు , అరేం రవి , భూక్య మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
04 Apr 2026 21:39:31
వెంకటాపురం : లోకల్ గైడ్ :ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని యాకన్నగూడెం గ్రామపంచాయతీ ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థుల కోసం ఎలకల రామారావు ఆధ్వర్యంలో టేబుల్,
