అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తాం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భీమా కంపెనీల నుంచి డబ్బు ఇప్పించండి
అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
ఖమ్మం :లోకల్ గైడ్ :
అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని, బీమా ప్రకారం సొమ్ము వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం మధిర నియోజకవర్గంలో సుడిగాలిలా పర్యటించారు. అందులో భాగంగా మధిర మండలం ఆత్కూరులోని అగ్నిప్రమాదానికి గురైన శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రితో పాటుగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, మాజీ ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
