ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర,మేడారం జాతర

కేంద్ర గనుల శాఖ మంత్రి  కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరమ్...వెల్లడి

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర,మేడారం జాతర

IMG-20260129-WA0162హనుమకొండ  జనవరి 29 లోకల్ గైడ్ 

శ్రీ సమ్మక్క సారమ్మ మేడారం జాతర రెండవ రోజు గౌరవ కేంద్ర గనుల శాఖ మంత్రి  కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరమ్ విచ్చేసిన సందర్భంగా వారికి  సహచర మంత్రులు దనసరి అనసూయ (సీతక్క), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో కలిసి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవార్లను దర్శించుకుని, నిలువెత్తు బంగారం సమర్పించి తమ మొక్కులు చెల్లించడం జరిగింది అన్నారు.ఈ సందర్భంగా కుంభ మేళాను తలపించే విధంగా సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహిస్తున్నామని, ఇక్కడికి వచ్చే భక్తుల కోసం శాశ్వతమైన ఏర్పాట్లు చేశామని తెలపడం జరిగింది. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగ గా గుర్తించాలని అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని గుర్తు చేయడం జరిగిందని తెలిపారు. ప్రధానితో చర్చించి జాతీయ పండుగగా  గుర్తింపు అందించాలని కోరడం జరిగింది అన్నారు .
ప్రధానమంత్రి ఆదేశాల మేరకు మేడారం జాతర అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని గౌరవ కేంద్ర గనుల శాఖ మంత్రి  కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరమ్ తెలిపారు. 
మేడారం మహా జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ గిరిజనుల సైతం మేడారం మహా జాతర గురించి తెలుసుకోవాలని, రాబోయే రోజుల్లో ఇక్కడి అమ్మవార్లను దర్శించుకోవాలని వారు పేర్కొన్నారు.
జాతరలో ఏర్పాట్లు బాగున్నాయని వారు కొనియాడారు.ఈ సందర్భంగా ఆదివాసి, గిరిజన, మేడారం భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున  కేంద్ర మంత్రులను సత్కరించి, చిరు జ్ఞాపికలను అందించడం జరిగిందని తెలిపారు.

Tags:

About The Author

Latest News

ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన           ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన          
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)  జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము.  వారు తమ ఓటు...
12న బెల్లంపల్లిలో బాడీ బిల్డింగ్ పోటీలు....
జిల్లాలోని మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డిసిపి. 
శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 274 వద్ద  ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి.                                                                
నూతన గుడి నిర్మాణానికి విరాళం
రవాణా రంగా పరిరక్షణ కార్మిక హక్కులకై జరిగే జాతీయ సమ్మె జయప్రదం చేయండి..
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు