జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి సమీక్ష సమావేశం.

బ్యాంకు కేసుల పరిష్కారంపై దృష్టి.

జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి సమీక్ష సమావేశం.

సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)
 
మార్చి25:బుధవారం సిద్దిపేట జిల్లా కోర్టు భవనంలో సమీక్ష సమావేశంనిర్వహించారు తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికారసంస్థ, హైదరాబాద్ మార్గదర్శకాలు మరియు సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి & జిల్లా న్యాయసేవాధికారసంస్థ చైర్‌పర్సన్ శ్రీమతి కే. సాయి రమాదేవి ఆదేశాల మేరకు జిల్లా కోర్టు భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి & FAC సెక్రటరీ, జిల్లా న్యాయసేవాధికారసంస్థ శ్రీ ఎన్. సంతోష్ కుమార్ అధ్యక్షత వహించారు. జిల్లాలోని బ్యాంకు మేనేజర్లు మరియు వారి స్టాండింగ్ కౌన్సెల్స్ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో బ్యాంకు రికవరీ కేసులు మరియు NI Act (చెక్ బౌన్స్) కేసులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ కేసులను మార్చి 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం కావడానికి బ్యాంకు అధికారులు, కౌన్సెల్స్ సమన్వయంతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా బ్యాంకు మేనేజర్లు, వారి స్టాండింగ్ కౌన్సెల్స్ పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News