కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.

ఐక్య ఉద్యమాలను బలోపేతం చేద్దాం.

కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.

ఎస్ వీరయ్య.

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి.మార్చి 15. (లోకల్ గైడ్).

 

     కేంద్ర ప్రభుత్వం కార్మికుల పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు.ఆదివారం ఎఫ్సిఐ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న సిఐటియు నల్గొండ జిల్లా 13వ మహాసభలలో ముగింపు ఉపన్యాసం చేశారు ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాల వలన కార్మిక వర్గానికి అందుతున్న కొద్దిపాటి ప్రయోజనాలను కూడా దూరం చేయడానికి కార్పొరేట్లకు ప్రయోజనాలు కలిగించేందుకు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరున సమస్యలను తీసుకొని రావడం కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని ఆరోపించారు. లేబర్ కోడ్ రద్దు చేయాలని 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ భారత కార్మిక వర్గం గత ఐదు సంవత్సరాలుగా అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించిందని అన్నారు కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె అన్ని కార్మిక సంఘాలు నిర్వహించగా 30 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొని నిరసన వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోళ్లను మా రాష్ట్రాలలో అమలు చేయమని కేరళ పశ్చిమ బెంగాల్ తమిళనాడు రాష్ట్రాలలో అసెంబ్లీ లో తీర్మానాలు చేశారని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు .ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 ఇండస్ట్రియల్ డిస్ప్లే యాక్ట్ 1947 ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ యాక్ట్ కలిపి సంఘం పెట్టుకునే హక్కు మీద దాడి చేస్తున్నారని 1926లో బ్రిటిష్ కాలంలో సాధించుకున్న కార్మిక హక్కులను వంద సంవత్సరాల తర్వాత మోడీ ప్రభుత్వం హరించి వేయడం అన్యాయమని రేడియన్ గుర్తింపు యజమానులు ప్రభుత్వాల దయాదాక్షిన్యాల కు వదిలేయడం సిగ్గుచేటు అని అన్నారు 300 మంది లోపు కార్మికుల ఉన్న పరిశ్రమల లే ఆఫ్ లాకౌట్ లకు ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా చేయడం ఐరన్ ఫైర్ సిస్టం ప్రకారం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ సిస్టం తీసుకురావడం ఉద్యోగ భద్రతకు స్వస్తి పలకడమేనని అన్నారు.ఈ మహాసభలో కార్మిక హక్కుల రక్షణ కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని తదితర 26 తీర్మానాలను మహాసభ ఆమోదించడం జరిగింది అనంతరం జిల్లా నూతన కమిటీని 55 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి వంగురి  రాములు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, లక్ష్మీనారాయణ ఎండి సలీం డబ్బికార్ మల్లేష్, దండంపల్లి సత్తయ్య  అవుట రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
        నూతన కమిటీ
అధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎండి సలీం, కోశాధికారి బి ప్రమీల, ఉపాధ్యక్షులు డబ్బికారు మల్లేష్, చినపాక లక్ష్మీనారాయణ, అవుత సైదులు, దండంపల్లి సత్తయ్య, లకపాక రాజు, మల్లు గౌతమ్ రెడ్డి, చింతపల్లి బయన్న, సహాయ కార్యదర్శులు నల్ల వెంకటయ్య, ఏర్పుల యాదయ్య, పెంజెర్ల సైదులు, అవుట రవీందర్ వల్లపు దాసు భూలక్ష్మి, డి రవి నాయక్, ఎస్.కె బషీర్ మరో 38 మంది కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Tags:

About The Author

Latest News