భద్రకాళి అమ్మవారి సాక్షిగా కుల వివక్ష.

మంద శ్యామ్ స్వేరో రాష్ట్ర మాజీ అధ్యక్షులు.

భద్రకాళి అమ్మవారి సాక్షిగా కుల వివక్ష.

హనుమకొండ IMG-20260206-WA0260   ఫిబ్రవరి 06 లోకల్ గైడ్:

శుక్రవారం రోజున ఆయన మాట్లాడుతూ 
వరంగల్ లోని భద్రకాళి టెంపుల్ పక్కన చేరబండరాజు నగర్ లో గత 30 సంవత్సరాల నుండి అప్పటి ప్రభుత్వం భమి కేటాయిస్తే అక్కడ చిన్న చిన్న గూడరాలు నిర్మించుకొని దాదాపు 40 నుండి 50 వరకు కుటుంబాలు జీవితాలను  కొనసాగిస్తున్నటువంటి ఈ దళిత కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హన్మకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  వారిని అక్కడి నుండి వెల్లగొట్టాలని 20 రోజుల నుండి నీళ్ళ సదుపాయం లేకుండా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.
అక్కడి ప్రజలు ఎమ్మెల్యే వద్దకు వెళ్లి వాళ్ళ సమస్య చెబితే ఈరోజు వాటర్ కట్ చేసారు.రేపు కరెంటు కట్ అవుతుంది తర్వాత ఇళ్ళు కూడా రాత్రికి రాత్రే కులా కొడతారు అని  ఎమ్మెల్యే  బెదిరించడం జరిగిందని తెలిపారు.
మీకు ఈ ప్రజలు ఓట్లు వేసి గెలిస్తే 
ఈరోజు ఇళ్లు వదిలి వెళ్ళిపొండి అని చెప్పే హక్కు మీకు ఎవరిచ్చారని అన్నారు.ఈ ఇళ్లు మట్టితో కట్టిన గోడలు కాదు వారి రక్తని చెమట చుక్కలుగా మార్చి కట్టినవీ 
అవి వారి ఇళ్ళు మాత్రమే కాదు ఇవి వారి జీవితాలు,వారి కన్నీళ్లు,వారి కలలు,వారి భవిష్యత్ 
ఇలాంటి కుట్రలకు స్వస్థి పలకుంటే మీ ప్రభుత్వని గద్దె దింపుడు ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వేరోస్ రాష్ట్ర నాయకులు బోట్ల ప్రశాంత్ , స్వేరోస్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తెల్లూరు సురేష్, స్వేరోస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు దూడల సిద్దు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ అంబాల చింటూ , భూపాల్ పల్లి స్వేరో నాయకులు అల్లూరి తిరుపతి, మనోజ్, సాధత్,    చేరబండరాజు నగర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News