చీఫ్ మినిస్టర్ కప్ 2025 రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలు ప్రారంభం
జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జంగపల్లి వెంకట నరసయ్య లు లాంఛనంగా ప్రారంభించారు.
లోకల్ గైడ్ తెలంగాణ బ్యూరో
గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించే భాగంగా క్రీడా పోటీలను నిర్వహించి, ప్రతిభావంతులను గుర్తించే విధంగా చీఫ్ మినిస్టర్ కప్ 2025 రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలు సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ ప్రాజెక్టు పై జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జంగపల్లి వెంకట నరసయ్య లు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్పు పేరిట గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను గుర్తించడానికి, ప్రతిభా గల క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నట్లు వారు చెప్పారు. రాష్ట్రస్థాయి సైకిల్ పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి సుమారు 400 మంది విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. మౌలిక వసతులు కల్పించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా సైకిల్ అసోసియేషన్ అధ్యక్షుడు బండారుపల్లి శ్రీనివాస్, కోశాధికారి చింతకింది శ్రీనివాస్, జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ సెక్రటరీ సౌందర్య, ఖేలో ఇండియా కోచ్ సంజీవ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ మంగారెడ్డి, సిద్దిపేట్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చిన్నకోడూర్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, చంద్లాపూర్ సర్పంచ్ శేఖర్, మాజీఎఫ్ సెక్రటరీ పాతూరి సుజాత, రామేశ్వర్ రెడ్డి, మాలతి, సువర్ణ లత, ఉప్పలయ్య, సిద్దిపేట జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, కోచులు, సైక్లిస్టులు తదితరులు పాల్గొన్నారు.
