చిట్యాల హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు.
ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ప్రార్థించిన మంత్రి కోమటిరెడ్డి.
By Ram Reddy
On
నల్లగొండ ఉమ్మడి జిల్లా. ఫిబ్రవరి 11. (లోకల్ గైడ్)
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర రోడ్లు,
భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటు హక్కు వినియోగించు
కోవడానికి నల్లగొండకు బయలుదేరారు.హైదరాబాద్ నుండి నల్లగొండకు వెళ్తూ మార్గమధ్యంలోని చిట్యాల హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు
నిర్వహించారు. ప్రజలందరూ సుభిక్షంగా,సంతోషంగా ఉండాలని ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.నేడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో ప్రతి ఓటరు బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఓటు విలువైనదని ఆయన పేర్కొన్నారు.
Tags:
About The Author
Latest News
22 Feb 2026 23:54:23
ఎన్కతల పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్
మోమిన్ పెట్ మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో నూతన గృహప్రవేశానికి హాజరైన గృహప్రవేశ ఆహ్వానంలో ఎన్కతల సర్పంచ్ పటేల్ గారి...
