సొంత గూటికి సత్తెన్న కందుకూరు మండలం నుంచి కాంగ్రెస్ లో చేరికలు.
కార్యకర్తల బలంతో వచ్చే ఎన్నికల్లోనూ విజయం . కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
By Ram Reddy
On
లోకల్ గైడ్ న్యూస్ కందుకూరు
ఇవాళ తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో కందుకూరు సీనియర్ నాయకులు, మహేశ్వరం నియోజకవర్గం తెలంగాణ జాగృతి ఇన్ఛార్జి అందుగుల సత్యనారాయణ సహా పలువురు కాంగ్రెస్ లో చేరారు.
ఈ సందర్భంగా KLR మాట్లాడుతూ... కార్యకర్తల బలం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
పార్టీని వీడిన నాయకులు మళ్లీ కాంగ్రెస్ లో చేరటం సంతోషమన్నారు. అందుగుల సత్యనారాయణ సహా మహిళలు, యువకులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కిచ్చెన్నగారు హామీ ఇచ్చారు.
పంచాయతీలు, పట్టణాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.
వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ నాయకులకే పట్టం కట్టాలని లక్ష్మారెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి.
Tags:
About The Author
Latest News
22 Feb 2026 23:54:23
ఎన్కతల పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్
మోమిన్ పెట్ మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో నూతన గృహప్రవేశానికి హాజరైన గృహప్రవేశ ఆహ్వానంలో ఎన్కతల సర్పంచ్ పటేల్ గారి...
