ఎన్కతల పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్
మోమిన్ పెట్ మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో నూతన గృహప్రవేశానికి హాజరైన గృహప్రవేశ ఆహ్వానంలో ఎన్కతల సర్పంచ్ పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.... తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాల కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు 400 నుండి 600 వరకు చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇంటిని నిర్మించుకోవాలన్ని ఎన్కతల గ్రామంలో మొదటి ఇల్లు దొడ్ల ప్రకాష్ రాములు కంప్లీట్ అయ్యిందని అన్నారు. గ్రామంలో వీధి దీపాలు బిగించి గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తానని త్రాగునీటి సరఫరా వేసవిలో అంతరాయం జరగకుండా ప్రతి ఇంటికి నీళ్లు వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. నిర్మాణానికి హాజరైన శ్రీకాంత్ గౌడ్ చీల్లా పల్లి నారాయణరెడ్డి,ఉప సర్పంచ్ దొబ్బని సరోజ సురేష్ వార్డు నెంబర్స్ ప్రవీన్, పట్లోళ్ల మహిపాల్ రెడ్డి ఇందిరమ్మ కమిటీ నెంబర్ లు కాలనీవాసులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.