మంచిర్యాల మేయర్ బాధ్యతల స్వీకరణ.
By Ram Reddy
On
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా ధర్ని మధుకర్,డిప్యూటీ మేయర్ గా సల్ల రమ్యలు ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేం సాగర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు నగరాభివృద్ధికి కట్టుబడి,ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతన మేయర్,డిప్యూటీ మేయర్ లు అడుగులు వేయాలని కోరుకుంటు అభినందనలు తెలియజేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంచిర్యాల నగరంలో ప్రవేశపెడుతు మంచిర్యాలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కమిషనర్,పలువురు కార్పొరేటర్లు,నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
22 Feb 2026 23:54:23
ఎన్కతల పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్
మోమిన్ పెట్ మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో నూతన గృహప్రవేశానికి హాజరైన గృహప్రవేశ ఆహ్వానంలో ఎన్కతల సర్పంచ్ పటేల్ గారి...
