ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి వినతి.

రంగారెడ్డి జిల్లా టీజీఓల డైరీ-2026,  క్యాలెండర్ ను అందచేశారు. 

ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి వినతి.

 

రంగారెడ్డి జిల్లా బ్యూరో ఫిబ్రవరి 20, ( లోకల్ గైడ్ ):         గెజిటెడ్ అధికారులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డికి తెలంగాణా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు డాక్టర్ రామారావు,  కార్యదర్శి శ్రీనేష్ కుమార్ నోరి సంఘం సభ్యులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అయనను కలిసి రంగారెడ్డి జిల్లా టీజీఓల డైరీ-2026,  క్యాలెండర్ ను అందచేశారు. 
రంగారెడ్డి జిల్లా గెజిటెడ్ ఆఫీసర్లకు ఇంటి స్థలాల కోసం రంగారెడ్డి జిల్లా గెజిటెడ్ ఆఫీసర్ల పరస్పర సహాయ సహకార గృహనిర్మాణ సొసైటీ కి భూమిని కేటాయించాలని కోరారు. ఉద్యోగులకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని,  వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ఏర్పాట్లు చేయాలని నివేదించారు.
ఈ సమావేశంలో శాంతిశ్రీ, సైదమ్మ, జ్యోత్స్న,  రాణి,  పావని,  మసూద్ అలీ, ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ అజయ్ వీర్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం