వరంగల్ రాష్ట్ర మహాసభకు బయలుదేరిన కార్మికులు.

హాస్పిటల్ కార్మికులు వేతనాలు పెంచాలి.

వరంగల్ రాష్ట్ర మహాసభకు బయలుదేరిన కార్మికులు.

ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పళ్ళ దేవేందర్ రెడ్డి .

 

 

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా  ఫిబ్రవరి 28. ( లోకల్ గైడ్)

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాలని మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి  పల్లా దేవేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం వరంగల్ లో జరుగుతున్న మెడకల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభకు నల్లగొండ నుంచి కార్మికులు బయలుదేరి వెళ్లడం జరిగింది .ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ సంవత్సరాల తరబడి ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాల పెంచకుండా ప్రభుత్వం కాంట్రాక్టర్లు కార్మికులతో పెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆరోపించారు. ఆస్పత్రులు పరిశుభ్రంగా ఉంచుతూ రోగులకు సేవలందిస్తున్న కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని అన్నారు. టెండర్ల కాలపరిమితి ముగిసిన కొత్త టెండర్లు పిలవకుండా పాతవారితోనే పని చేయిస్తున్నారని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచి కనీస వేతనం 26000 ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కార్మికుల  కాంట్రాక్టు యూనియన్ నాయకులు ఏం యాదగిరి పి ఎల్లమ్మ,సి హెచ్. నిర్మల,ఏ లింగస్వామి, టి పద్మ ఉషమ్మ,భాగ్యమ్మ, ఏ పద్మ,శ్రీదేవి, ఎన్ రేణుక తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News