పెద్దేముల్ ఎస్సై శంకర్ బదిలీ.
పెద్దేముల్ ఎస్సైగా గతంలో విధులు నిర్వహించిన ప్రశాంత్ వర్ధన్ ను తిరిగి నియమించారు.
By Ram Reddy
On
లోకల్ గైడ్/ తాండూర్:
పెద్దేముల్ మండల ఎస్సై శంకర్ ను బదిలీ చేస్తూ గురువారం జిల్లా పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పెద్దేముల్ ఎస్సైగా గతంలో విధులు నిర్వహించిన ప్రశాంత్ వర్ధన్ ను తిరిగి నియమించారు.ఇది ఇలా ఉంటే గత సంవత్సరం నవంబర్ నెలలో పెద్దేముల్ మండల ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన శంకర్, మూడు నెలల అనతి కాలంలోనే ప్రజలకు చేరువై ఠాణాకు వచ్చిన బాధితుల పట్ల వినయంగా ఉంటూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించినట్లు పలువురు ఆయన సేవలను కొనియాడారు. అదేవిధంగా అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక దృష్టితో కట్టడి చేశారు. ప్రస్తుతం ఎస్ఐ శంకర్ వికారాబాద్ బదిలీ అయినట్లు సమాచారం. కాగా ఈరోజు మధ్యాహ్నం పెద్దేముల్ ఎస్సైగా ప్రశాంత్ వర్ధన్ బాధ్యతలు స్వీకరించారు.
Tags:
About The Author
Latest News
09 Mar 2026 18:04:06
హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ మీడియా సంస్థకు అనుబంధం కాదని ఆ...
