పర్యావరణ పరిరక్షణకు పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరం - రాజేంద్ర నగర్ జోనల్ కమీషనర్ మందు మకరందద్.
99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా పీరంచెరువు వద్ద స్వచ్ఛా సండే కార్యక్రమం.
రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ): పర్యావరణ పరిరక్షణకు పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరమని రాజేంద్ర నగర్ జోనల్ కమీషనర్మందు మకరంద్ అన్నారు. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడ జాగిర్‌లోని పీరంచెరువు వద్ద కమ్యూనిటీ భాగస్వామ్యంతో చెరువు పరిసరాల్లో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్బంగా జోనల్ కమీషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన -ప్రభుత్వ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, ఇందులో అన్ని కాలనీ, బస్తీల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో అధికారులు ఓ ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్లాలని డీప్యూటీ కమిషనర్ సురేంద్ర రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీవో స్వాతి, ట్రైనీ గ్రూప్-1 ఆఫీసర్లు, యూసీడీ టీమ్, ఎంటమాలజీ డిపార్ట్మెంట్, శానిటేషన్ డిపార్ట్మెంట్ ఈఎంఓహెచ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా
రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని లేక్ డెవలప్‌మెంట్‌పై తమ సూచనలు తెలియజేశారు. త్వరలోనే కన్వర్జెన్స్ మీటింగ్ నిర్వహించి సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించారు. అదేవిధంగా ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో డ్రోన్ సాయంతో స్ప్రేయింగ్ నిర్వహించి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు చర్యలు తీసుకున్నారు.
