డాక్టర్ మహానంద చౌదరి ఔదార్యం స్ఫూర్తిదాయకం
రంజాన్ పండుగ సందర్భంగా పలు ముస్లిం కుటుంబాలకు కిట్లు పంపిణీ :
హమీద్ షేక్
మిర్యాలగూడ ఫిబ్రవరి 14
(లోకల్ గైడ్,తెలంగాణ )
మిర్యాలగూడ పట్టణానికి చెందిన కృష్ణ సాయి హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ మహానంద చౌదరీ ఔదార్యం స్ఫూర్తిదాయకం, అభినందనీయమని నల్లగొండ జిల్లా ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ పేర్కొన్నారు. వచ్చేవారం నుంచి రంజాన్ ఉపవాసదీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పలు ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లు పంపిణీ చేసేందుకు డాక్టర్ మహానంద చౌదరీ ముందుకొచ్చారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో హమీద్ షేక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఏడాది పవిత్ర రంజాన్ మాసంలో పలు ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లను అందజేస్తున్న డాక్టర్ మహానంద చౌదరీ సేవలు అద్వితీయమని హమీద్ షేక్ కొనియాడారు. రంజాన్ ఉపవాస దీక్షలను ముస్లిం సోదరసోదరీమణులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొవాలని, ప్రతీ ఒక్కరిపై అల్లా అనుగ్రహం ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీను,వహీద్, నర్సింహా, జయేష్, తదితరులు పాల్గొన్నారు.
