ప్రతి చిన్నారికి సంపూర్ణ    టీకాకరణే  మన లక్ష్యం

జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. రవికుమార్

ప్రతి చిన్నారికి సంపూర్ణ    టీకాకరణే  మన లక్ష్యం

లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా
ప్రతి చిన్నారి కి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సంపూర్ణ టీకా కరణ చేయాలనే లక్ష్యంతో సిబ్బంది పని చేయాలని  జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. రవికుమార్ తెలిపారు. తే
శనివారం అయన ఆకస్మికంగా పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వ్యాక్సిన్ నిలువలను, శీతలీకరణ స్థితిని, క్షేత్రస్థాయి సిబ్బంది ఏ సమయంలో వ్యాక్సిన్ తీసుకుపోయారు, మరియు టీకా కరణ ప్రగతి నివేదికలను తనిఖీ చేశారు. బిజినపల్లి మరియు మంగనూర్ ఆరోగ్య ఉప కేంద్రాలను సందర్శించి టీకా కరణ ప్రక్రియను పరిశీలించారు. వ్యాక్సిన్ల శీతలీకరణ స్థితిని, ఓపెన్ వయల్ పాలసీ పాటిస్తున్నారా లేదా , వ్యాక్సిన్ డ్యూ లిస్టును తనిఖీ చేశారు. టీకాలను తీసుకోవడానికి వచ్చిన చిన్నారుల తల్లులతో, గర్భవతులతో మాట్లాడి, వారు షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్లను తీసుకున్నారా లేదా తనిఖీ చేశారు. తర్వాత 
గర్భవతులకు  రక్తహీనత నివారణ కొరకే తీసుకోవాల్సిన పౌష్టికాహారం, సాధారణ ప్రసవం వలన కలిగే లాభాలను వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు పాల్గొనడం జరిగింది

Tags:

About The Author

Latest News