బౌరపూర్ జాతర ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి. చెంచు సంప్రదాయాలతో బౌరపూర్ జాతర ఘనంగా నిర్వహించాలి.

,.ఫిబ్రవరి 14 నుంచి మూడు రోజుల పాటు బౌరపూర్ జాతర,. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు.

బౌరపూర్ జాతర ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి. చెంచు సంప్రదాయాలతో బౌరపూర్ జాతర ఘనంగా నిర్వహించాలి.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

IMG-20260206-WA0213లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా,
 నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల దట్టమైన అటవీ లోతట్టు ప్రాంతంలో ప్రకృతి ఒడిలో మధ్య వెలిసిన లింగాల మండల పరిధిలోని అప్పాపూర్ గ్రామపంచాయతీ బౌరాపుర్ వద్ద గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే చెంచుల ఆరాధ్య దైవమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి జరిగే కళ్యాణ మహోత్సవం, చెంచు జాతర ఏర్పాటు పై వివిధ శాఖల అధికారులు, చెంచు పెద్దల జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్ చంద్ర, తో కలిసి శుక్రవారం  జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ,……..  చెంచు గిరిజనుల సాంప్రదాయ బద్ధంగా ప్రతి సంవత్సరం నిర్వహించే బౌరపూర్ జాతరను ఈ ఏడాది ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో మూడు రోజులపాటు ఆధ్యాత్మికంగా, దైవికంగా, అన్ని నిబంధనలు పాటిస్తూ ఎక్కడా ఎలాంటి లోపాలు జరగకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని తెలిపారు. ఈ నెల 15వ తేదీన జరగనున్న జాతర రథోత్సవం సందర్భంగా ఆదివాసీ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఆదివాసీ పూజారులతో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
జాతరకు హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా జాతర ప్రాంగణం అంతటా తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా మిషన్ భగీరథ అధికారులు తాగునీటి సరఫరా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య సిబ్బందితో విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.
జాతరకు వచ్చే చెంచు ప్రజలకు సరిపడే విధంగా భోజన వసతులు కల్పించాలని కలెక్టర్ డిటిడిఓను ఆదేశించారు. అలాగే పారిశుధ్యం, వైద్య సేవలు, ఆర్టీసీ బస్సుల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. జాతర ప్రాంగణంలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.
భక్తులకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, భద్రత దృష్ట్యా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జాతర పర్యవేక్షణ కోసం అన్ని శాఖల అధికారులతో నోడల్ ఆఫీసర్లను నియమించామని అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులు సంతృప్తి చెందేలా ఏర్పాట్లు చేయాలని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే చెంచు భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చెంచు నాయకులు పలు అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, కలెక్టర్ స్పందిస్తూ సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, డిఎంహెచ్ఓ డాక్టర్ రవి కుమార్, పిఓ ఐటీడీఏ మేనేజర్ జాఫర్, వివిధ శాఖల జిల్లా అధికారులు అప్పా పూర్ పెంట గ్రామ సర్పంచ్ శివమ్మ, చెంచు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News