యాసంగి ప్యాడీ కొనుగోళ్లకు పక్కా ఏర్పాట్లు తప్పనిసరి.

కలెక్టర్ కె. హైమావతి

యాసంగి ప్యాడీ కొనుగోళ్లకు పక్కా ఏర్పాట్లు తప్పనిసరి.

సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ) 

ఏప్రిల్ 1: సిద్దిపేట జిల్లాలో రబీ (యాసంగి) 2025-26 ప్యాడీ కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు.ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఈసారి జిల్లాలో ధాన్యం దిగుబడి అధికంగా ఉండే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలను తగిన విధంగా సిద్ధం చేయాలని సూచించారు. రైతులకు మంచినీటి సదుపాయం, టెంట్లు, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చర్ మీటర్లు వంటి అవసరమైన వసతులు ముందుగానే ఏర్పాటు చేయాలని తెలిపారు.అకాల వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఎత్తైన ప్రదేశాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, రైతులు పూర్తిగా ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే కేంద్రాలకుIMG-20260401-WA0090 తీసుకురావాలని అవగాహన కల్పించాలని చెప్పారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టకుండా చూడాలని కూడా సూచించారు.ప్రతిరోజూ ధాన్యాన్ని లారీల్లో లోడ్ చేసి అదే రోజు మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, మిల్లుల సామర్థ్యానికి అనుగుణంగా ధాన్యం కేటాయింపులు చేయాలని తెలిపారు. నిల్వ సామర్థ్యాన్ని ముందుగానే సమీక్షించి అవసరమైతే అదనపు గోదాములు సిద్ధం చేయాలని సూచించారు.ఎక్కడైనా నిర్లక్ష్యం ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కలెక్టర్, ఎఫ్‌ఏక్యూ ప్రమాణాల అమలులో అలసత్వం వహిస్తే వ్యవసాయ శాఖ అధికారులపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, సివిల్ సప్లై అధికారులు, మార్కెటింగ్ శాఖ, మెప్మా మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News