ప్రజలు మెచ్చే పరిపాలన అందించాలి.
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
నారాయణపేట ఫిబ్రవరి 25:
ప్రజలు మీపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించారని, ఇది మంచి అవకాశమని, ప్రజలు మెచ్చేలా ఐదు సంవత్సరాల పాటు పాలన అందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సర్పంచి అనేది కేవలం పదవి కాదని ఒక బాధ్యత , కర్తవ్యం అని ఆమె తెలిపారు. గ్రామాలలో మెరు గైన పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలను ఏర్పాటు చేసి ఆదర్శ సర్పంచులుగా పేరు తెచ్చుకో వాలన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలు పు దారి వద్ద గల వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో ఈ నెల 23 నుంచి ప్రారంభమైన మూడో విడత సర్పంచుల ఓరియంటేషన్ శిక్షణ తరగ తుల శిబిరాన్ని బుధవారం కలెక్టర్ జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ తో కలిసి సందర్శించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి మీరంతా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. కానీ శిక్షణా తరగతుల కు చాలా మంది సర్పంచులు గైర్హాజరు కావడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. మీరంతా ప్రజా ప్రతినిధులు ఇలా శిక్షణ కు హాజరు కాకపోతే ఎలాగని ప్రశ్నించారు. ఏదైనా నేర్చు కుంటేనే కదా ఐదేళ్ల పాటు ప్రజలకు ఏమైనా చేయగలు గుతారు కదా అన్నారు. కానీ జాతరలు, పండగలు అని ఇలా శిక్షణ కు గైర్హాజరు కావ డం సబబు కాదు అన్నారు. జిల్లాలో నేటికి చాలా గ్రామా ల్లో ముఖ్యంగా మక్తల్ నియో జక వర్గంలోని గ్రామాలలో ఇంకా బహిర్భూమికి వెళ్తు న్నారనీమంత్రి కూడా చాలా సందర్భాలలో తనతో చెప్పా రని ఆమె గుర్తు చేశారు. గ్రామాల్లో ప్రజలు మరుగు దొడ్లను వినియోగించుకునేలా కొత్తగా ఎన్నికైన సర్పంచులు చైతన్యం కల్పించాలన్నారు. మరుగు దొడ్లు లేని వారికి కొత్తగా నిర్మించుకునేందుకు నిధులు ఇస్తామన్నారు. అవ సరమైనతే గ్రామాలలో సామూహిక మరుగు దొడ్లను నిర్మించాలని అధికారులకు సూచించారు. ఈ నెలలో మిషన్ భగీరథ అధికారులు అన్ని గ్రామాల్లో పర్యటించి తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నారని, మీ గ్రామాలకు అధికారులు వచ్చారా అని ఈ సందర్భంగా కలెక్టర్ సర్పంచులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా గ్రామాల్లో ఎక్కడైనా తాగునీ టి సమస్య తలెత్తే అవకాశం ఉంటే అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళాలని ఆమె సూచించారు. అలాగే గ్రామాల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ కోసం సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ శాఖ ఏ. ఈ. వో లకు సహకారం అందించా లని అన్నారు. మీ మీ గ్రామా లలో ఇండ్లు లేని వారు ఎవ రైనా ఉంటే ఎంపీడీవో లతో పేర్లు రాయిస్తే వెంటనే కొత్తగా ఇందిరమ్మ ఇండ్లను మంజూ రు చేస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. అలాగే మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయని, గ్రామాలలో ఉన్న పాఠశాలల హెచ్. ఎం లకు సహకరించి విద్యార్థులను రెగ్యులర్ గా పాఠశాలకు పంపించేలా సర్పంచులు విద్యార్థుల తల్లి దండ్రులకు సూచించాలన్నా రు. పాఠశాలకు రెగ్యులర్ గా రాని విద్యార్థులే పదో తరగతి లో ఫెయిల్ అవుతున్నారని ఆమె స్పష్టం చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచుల గ్రామా లకు చెందిన పదో తరగతి విద్యార్తులెవ్వరూ ఈ సారి పరీక్షలలో ఫెయిల్ కావొద్దని కలెక్టర్ కోరారు. శిక్షణ ను సద్వినియోగం చేసుకుని గ్రామాలలో ప్రజలు మెచ్చేలా పరిపాలన అందించాలని అన్నారు. కొత్త సర్పంచుల గ్రామ పరిపాలనను చూడటా నికి తాను గ్రామాల సందర్శన చేస్తానని కలెక్టర్ ప్రకటించా రు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ మాట్లాడుతూ దేశ జనాభాలో 2.60 లక్షల మంది సర్పంచులు ఉన్నారని, కొత్త గా ఎన్నికైన సర్పంచులు తమ తమ గ్రామాలకు పెద్ద దిక్కులా ఉండి గ్రామాభివృ ద్ధికి పాటు పడాలన్నారు. గ్రామాల్లో ఏమైనా అభివృద్ధి పనులు చేయాలంటే నిధులు తప్పని సరి అని, కానీ నిధు ల ఖర్చు లేకుండా గ్రామాల్లో బాల్య వివాహాలను నివారిం చవచ్చునీ, కుల వ్యవస్థను నిర్మూలించవచ్చనీ, మత సామరస్యాలు లేకుండా చేయవచ్చని, ఘర్షణలు లేని గ్రామాలుగా తయారు చేయ వచ్చని ఆయన తెలిపారు. గ్రామాలకు ఎవరైనా అను చిత వ్యక్తులు వస్తే వారిపై దృష్టి పెట్టాలన్నారు. వేరే వాళ్లు వచ్చి ఉంటే వాళ్ళ పేర్లు రాసుకోవాలన్నారు. గ్రామ భద్రతకు సర్పంచి కూడా బాధ్యత తీసుకోవాలన్నారు. ఇకపై గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఒక వాల్ పోస్టర్ పెట్టి వాటిపై చైల్డ్ హెల్ప్ లైన్, గ్రామ పోలీసు అధికారి, షీ టీమ్ నంబర్ల ను రాసి పెడతాం అని ఆయన తెలిపారు. గ్రామాభివృద్ధి తోనే దేశాభివృద్ధి సాధ్యం అని అన్నారాయన. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రెడ్డి, సీఐ శివశంకర్, ఎస్ ఐ. వెంకటేశ్వర్లు, ఆయా మండలాల ఎంపీడీవోలు, డిపివో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:10.సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్
---------------------------------------
