ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులను వేగవంతం చేయాలి… నిర్లక్ష్యానికి తావు ఉండదు. ---మేయర్

ఉడెఫ్ , ఎం జి ఎఫ్  నిధులతో   కొనసాగుతున్న పనులపై మేయర్ సమీక్ష

ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులను వేగవంతం చేయాలి… నిర్లక్ష్యానికి తావు ఉండదు. ---మేయర్

ఖమ్మం,:లోకల్ గైడ్ :

నగరపాలక సంస్థ పరిధిలో యుఐడిఎఫ్ , ఎం జి ఎఫ్ నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై నగర మేయర్ శ్రీమతి పునుకులు నీరజ, సమగ్ర సమీక్ష నిర్వహించారు. మేయర్ ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో ఈఈలు, డీఈలు, ఏఈలు మరియు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
నగరంలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ పనుల పురోగతిని మేయర్ విడమరచి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే మంజూరైన నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేయాలని, పనులలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.
ప్రతి పనిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.
అభివృద్ధి పనులు సమయానికి పూర్తయితేనే ప్రజలకు నిజమైన ప్రయోజనం చేకూరుతుందని మేయర్ పేర్కొన్నారు. 
అధికారులు సమన్వయంతో పని చేసి నగరాభివృద్ధికి తోడ్పడాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో ఈ ఈ కృష్ణలాల్, డిఇలు ఏలు హాజరయ్యారు.

Tags:

About The Author

Latest News