ప్రభుత్వ విద్యారంగ సంస్కరణలు దేశానికి ప్రమాదకరం ఖమ్మం: లోకల్ గైడ్-శాస్త్రీయ, ప్రజాస్వామ్య విద్య కోసం సమాజమంతా సంఘటితం కావాలి.
పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలో హెచ్.సి.యు. ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ.
By Ram Reddy
On
లోకల్ గైడ్
శనివారం ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభల నిర్వహణలో భాగంగా రాష్ట్రవ్యాప్త విద్యార్థి ప్రతినిధులతో రెండవ రోజు కొనసాగింది.
ఈ మహాసభ ప్రారంభానికి ముందు పి.డి.ఎస్.యు. బిగిపిడికి జెండా ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ ఆవిష్కరించగా, విద్యార్థి అమరవీరులను స్మరిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టరు. మహాసభ ప్రతినిధులు విద్యార్థి అమరులకు రెండు నిమిషాలు ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం జరిగిన మహాసభలో *ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు ప్రముఖ విద్యావేత్త ఐ.వి. రమణారావు* తొలి పలుకులు పలుకుతూ సమాజ మార్పులో విద్యార్థులు క్రియాశీలక పాత్ర పోషించాలని, వివిధ దేశాల్లో విద్యార్థులు నిర్వహించిన పోరాటాలు ప్రపంచ దశ,దిశ లనే మార్చి వేశాయని గుర్తు చేశారు.
*హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ*
మహాసభలను ప్రారంభిస్తూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో సామాజిక శాస్త్రాలను పథకం ప్రకారం సమాధి చేస్తూ, మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులను ప్రవేశ పెడుతూ
విద్య రంగాన్ని పూర్తిగా వ్యాపార మయంగా మార్చి వేస్తున్నారని, దీంతో ఆర్థిక బలహీనతతో ఉన్న పేద కుటుంబాల విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆర్థిక విధానాల ఫలితంగానే దేశంలో పేదరికం, నిరుద్యోగం, అణచివేతలు, సామాజిక, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేషనలైజేషన్ పేరిట వేలాది ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్నదని, ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తూన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీల కాంట్రాక్ట్ కమిషన్ల కోసం, కార్పొరేట్ పెట్టుబడిదారి బహుళ జాతి కంపెనీల లాభాల కోసం మాత్రమే స్కిల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నారని తీవ్రంగా ఆక్షేపించారు. ఎన్నికల ముందు విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పి నేడు ముఖ్యమంత్రి ముఖం చాటేసారని అన్నారు.
కేంద్రంలో నరేంద్ర మోడీ తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం-2020 అమలు వలన దేశ లౌకిక వ్యవస్థ, భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తి, ప్రజాస్వామిక లక్ష్యాలు ప్రమాదంలో పడ్డాయని అన్నారు. విద్యారంగంలో కాషాయీకరణ విధానాలను వేగంగా తీసుకువస్తూ, ప్రశ్నించలేని మెదళ్లను తయారు చేయడమే పనిగా పెట్టుకొని, భారత రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా, మత రాజ్యాన్ని స్థాపించే కుట్రలకు మోడీ ప్రభుత్వం పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి విద్యార్థులు ప్రగతిశీల భావజాలాన్ని అలవర్చుకొని, కుల, మతోన్మాద దోపిడి భావజాల వ్యాప్తిని అడ్డుకోవాల
ని పిలుపునిచ్చారు. *టి.పి.టి.ఎఫ్.రాష్ట్ర మాజీ* *ప్రధాన కార్యదర్శి వి.మనోహర్ రాజ్* మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రజల హక్కులను, ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ, దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య మనుగడను ప్రశ్నార్థకంగా మార్చి వేస్తున్నదని అన్నారు.
ఈ మహాసభలో వివిధ వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని సందేశం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహారావు, ఎర్ర అఖిల్ కుమార్, ఎం.నరేందర్, ఎస్.రాకేష్, సహాయ కార్యదర్శులు ఎం.సాయి, కర్క గణేష్, జి.సురేష్,వి. వెంకటేష్, రాష్ట్ర నాయకులు హలో అలువాల నరేష్, ఎల్. అనిల్, అంగిడి కుమార్, మునిగేల శివప్రసాద్,బి.అజయ్, అషూర్, వి.కావ్య,పి.అనూష, గుమ్మడి చైతన్య,దీక్షీత, సీతారాం,మధు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
మహాసభలో అరుణోదయ కళాకారులు ఆలపించిన విప్లవ గేయాలు, సంస్కృతిక కార్యక్రమాలు మహాసభ ప్రతినిధులను ఉత్తేజపరిచాయి.
Tags:
About The Author
Related Posts
Latest News
03 Feb 2026 13:42:52
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
