ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో

పలుగు పారా పట్టిన ఎం పీ డీ వో, సర్పంచ్

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 7 :

తెలంగాణ  రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా  చేపట్టిన, ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక  అమలు లో భాగంగా కారేపల్లి మండలం లోనీ భాగ్యనగర్  తండా గ్రామపంచాయితీ  లో ముమ్మరంగా  పనులు  గుర్తింపు తో  పాటు  అక్కడే  అయిపోయే పనులను  చేస్తున్నారు.  పరిశుద్ధ పనుల్లో  ఈ  రోజు   గ్రామం లో రోడ్ల వెంబడి పేరుకు పోయిన చెత్త ఏరివేత వంటి కార్యక్రమం లను చేయగా కార్యక్రమం లో భాగంగా స్థానిక ఎం పీ డీ వో శ్రీనివాసరావు, సర్పంచ్ బానోత్ హీరాలాల్  పాల్గొని  పనులు  చేశారు.  అనంతరం  మాట్లాడుతు  గ్రామాలలో అభివృద్ధి  పనులకు  ఈ  ప్రణాళిక   మంచిగా  ఉపయోగ పడుతుందని  ఈ  కార్యక్రమలకు ప్రజలు  పాల్గొనాలని కోరారు.
ఈ  కార్యక్రమం  లో   పంచాయితీ కార్యదర్శి  అనిల్  కుమార్, ఉప సర్పంచ్  భిక్కులాల్, వార్డ్ సభ్యులు గాంధీ,  గ్రామస్తులు వీరన్న, గిరి ప్రసాద్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News