ప్రమాదంలో కుడి చేతిని కోల్పోయిన కార్మకునికి 31 లక్షల
31వెయ్యి రూపాయల చెక్కు అందించిన కలక్టర్.
By Ram Reddy
On
ఖమ్మం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనులలో హెచ్ జి ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ తరపున కాంట్రాక్ కార్మికుడిగా పనిచేస్తున్న పరవేశ అనే కార్మికుడు విధి నిర్వహణలో ఉండగా గత సంవత్సరం జూలై 30 తేదీన జరిగిన ప్రమాదంలో తన కుడి చేతిని కోల్పోయినారు. ఈ ఘటనపై సంబంధిత సంస్థకు నోటీసు జారీ చేయగా, యాజమాన్యం అయిన హెచ్ జి ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ వారు కార్మిక నష్టపరిహార చట్టం కింద రూ.31,31,000/- మొత్తాన్ని డిపాజిట్ చేశారు.
ఈరోజు బాధిత కార్మికుడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ నుండి ఖమ్మం చేరుకోగా, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేతుల మీదుగా ఆ నష్టపరిహార మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేసి, అనంతరం అతని బ్యాంకు ఖాతాలోకి ఆ మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా జమ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పని ప్రదేశాలలో ఎలాంటి ప్రమాదాలు జరిగినా, ఇన్సూరెన్స్ లేదా ఇతర భద్రతా అంశాల పరంగా కార్మికులకు ఇబ్బందులు ఎదురైన సందర్భంలో వెంటనే కార్మిక శాఖను సంప్రదించాలని సూచించారు.
ఈ మొత్తం ప్రక్రియను ఉప కార్మిక కమిషనర్ ఖమ్మం, శ్రీ కే. విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వేగవంతంగా పూర్తి చేశారు.
Tags:
About The Author
Latest News
20 Mar 2026 17:57:39
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
